గుడ్‌న్యూస్‌.. రేపు ఈ జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. రేపటి నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది.

By అంజి
Published on : 24 Aug 2025 10:00 AM IST

Smart ration cards, Andhra Pradesh, Minister Nadendla Manohar

గుడ్‌న్యూస్‌.. రేపు ఈ జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. రేపటి నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది. నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఆయా రేషన్ షాపుల దుకాణాల వద్ద స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా రేపు నుంచి 9 జిల్లాల్లో విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.

రెండో విడత 30వ తేదీ నుంచి 4 జిల్లాలు చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో, మూడో విడత వచ్చే నెల 6వ తేదీ నుంచి అనంతపురం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో, నాలుగో విడత వచ్చే నెల 15 నుంచి బాపట్ల, పలనాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీసత్య సాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారన్నారు.

గ్రామ/వార్డు స్థాయిలో యాప్ ఏర్పాటు చేసామని అంతేకాకుండా డాష్ బోర్డు ద్వారా స్మార్ట్ కార్డు వివరాలు కూడా చూడొచ్చని మంత్రి నాదెండ్ల తెలిపారు. వలస వెళ్లిన వారు నమోదు చేసుకున్న రేషన్ షాపు వద్దనే స్మార్ట్ కార్డు తీసుకోవాలని, ఇప్పటికే రేషన్ ను ఎక్కడైనా తీసుకునే విధంగా పోర్టబులిటీ చేయడం జరిగిందన్నారు.

Next Story