మంత్రి ఆదిమూలపు సురేష్ కు స్వల్ప అస్వస్థత
Slight Illness of Minister Adimulapu Suresh.ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్వల్ప అస్వస్థతకు
By తోట వంశీ కుమార్ Published on
25 Jun 2022 7:42 AM GMT

ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు(శనివారం) ఉదయం మార్కాపురంలోని జార్జి ఇంజనీరింగ్ కాలేజీలో వాకింగ్ చేస్తున్న సమయంలో మంత్రి అస్వస్థతకు లోనైయ్యారు. ఒక్కసారిగా ఆయన కిందపడిపోయారు. వ్యక్తిగత వైద్యులు వెంటనే అక్కడకు చేరుకుని మంత్రికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గులు కారణంగా ఇలా జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు కాలేజీలోనే చికిత్స అందించారు. ప్రస్తుతం మంత్రి కాలేజీలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
కాగా.. కొద్ది రోజుల క్రితం మంత్రి సురేశ్ అస్వస్థతకు గురైయ్యారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో మంత్రి సురేష్‌కు వైద్యులు యాంజియోగ్రామ్ చేసిన విషయం తెలిసిందే.
Next Story