ఫెర్రీఘాట్‌లో ఆరుగురు విద్యార్థులు గల్లంతు.. ఐదుగురు సురక్షితం

Six students go missing at Ibrahimpatnam ferry ghat. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ దగ్గర స్నానానికి దిగిన ఆరుగురు విద్యార్థులు

By అంజి
Published on : 19 Aug 2022 12:56 PM IST

ఫెర్రీఘాట్‌లో ఆరుగురు విద్యార్థులు గల్లంతు.. ఐదుగురు సురక్షితం

ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్‌ దగ్గర స్నానానికి దిగిన ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. కొండపల్లి కాలనీకి చెందిన విద్యార్థులు.. ఫెర్రీఘాట్‌లో స్నానానికి వెళ్లారు. నీటిలో దిగిన విద్యార్థులు.. వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, స్థానికులు.. వెంటనే అప్రమత్తమై ఐదుగురు విద్యార్థులను రక్షించారు. మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణా ప్రసాద్ ఆదేశంతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.

వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలు కష్టంగా మారింది. గల్లంతైన విద్యార్థి పేరు లోకేష్‌గా గుర్తించారు. ఘాట్‌లోకి దిగిన విద్యార్థులు.. స్థానిక జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్నారు. గల్లంతైన బాలుడు సురక్షితంగా రావాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుకుంటున్నారు. అయితే భారీ వరద వల్ల ఫెర్రీఘాట్‌లో సెర్చ్‌ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఫెర్రీఘాట్‌లో గతంలో కూడా అనేకసార్లు ప్రమాదాలు జరిగాయి. పలుమార్లు బోట్లు కూడా తిరగబడ్డ సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Next Story