గాల్లోనే ఆగిన షటిల్‌ కాక్‌.. ఎలాంటి సపోర్ట్‌ లేకుండానే.. వీడియో వైరల్

Shuttle cock stuck in Air at kunavaram Allurisitaramaraju district. గాలి మధ్యలో షటిల్ కాక్ ఆగిపోయిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి వీక్షకులను

By అంజి  Published on  9 Dec 2022 2:18 PM IST
గాల్లోనే ఆగిన షటిల్‌ కాక్‌.. ఎలాంటి సపోర్ట్‌ లేకుండానే.. వీడియో వైరల్

గాలి మధ్యలో షటిల్ కాక్ ఆగిపోయిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి వీక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం టేకులబోర గ్రామంలో చోటుచేసుకుంది. వైరల్ వీడియోలో.. ఒక బాలుడు వారు షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నట్లు చెప్పడం కనిపించింది. షటిల్‌ ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా షటిల్ కాక్ గాలి మధ్యలో ఆగిపోయింది. అయితే అది ఎలాంటి సపోర్ట్‌ లేకుండానే కొన్ని నిమిషాల పాటు గాల్లో ఆగింది.

బాలుడు షటిల్ బ్యాట్‌ను గాలిలోకి విసిరేయడంతో.. షటిల్ కాక్ అరగంటకుపైగా గాలిలో ఆగి నేలపై పడిపోయినట్లు తెలిసింది. ఈ వింత ఘటనను వారు ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన చూసి అక్కడి జనాలు నివ్వెరపోయారు. ఇదేలా సాధ్యం అని చాలామంది నోరెళ్లబెడుతున్నారు. ఇక వీడియోను చూసిన మరికొందరు మాత్రం.. వైరల్‌ చేసేందుకే ఈ వీడియోను క్రియేట్‌ చేశారని చెబుతున్నారు.


Next Story