ఏపీలో ఒమిక్రాన్ క‌ల‌క‌లం.. ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు

Seven more Omicron cases detected in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప‌కింద నీరులా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2022 2:59 AM GMT
ఏపీలో ఒమిక్రాన్ క‌ల‌క‌లం.. ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప‌కింద నీరులా విస్త‌రిస్తోంది. మంగ‌ళ‌వారం నాడు రాష్ట్రంలో ఏడు ఒమిక్రాన్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 24కు చేరింది. తాజాగా న‌మోదైన కేసుల్లో ఒమన్ నుంచి ఇద్ద‌రు, యూఏఈ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు, దక్షిణ సూడాన్ నుంచి ఒకరు, గోవా నుంచి ఒకరు చొప్పున ఉన్నట్లు తెలిపారు. వారిలో ఒక‌రికి మోస్త‌రు ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. మిగిలిన వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌న్నారు. వీరంతా ఐసోలేష‌న్లో ఉన్నారు.


ఇక రాష్ట్రంలో క‌రోనా రోజువారి కేసులు కూడా పెరుగుతున్నాయి. నిన్న రాష్ట్రంలో 334 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య‌ 20,77,942కి చేరింది. 95 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,61,927కి చేరింది. క‌రోనా కార‌ణంగా ఒకరు మ‌ర‌ణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,499కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,516 యాక్టివ్ కేసులున్నాయి.

Next Story