బ్రేకింగ్‌.. ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు న‌మోదు

Second Omicron case detected in AP.తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2021 6:52 AM GMT
బ్రేకింగ్‌.. ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు న‌మోదు

తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. తాజాగా ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో ఒమిక్రాన్ కేసు న‌మోదు అయింది. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరుకుంది. కెన్యా నుంచి చైన్నై మీదుగా తిరుప‌తికి వ‌చ్చిన 39 ఏళ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆమె శాంపిల్స్‌ను సేక‌రించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. తాజాగా ఫ‌లితాలు వ‌చ్చాయి. ఆ ఫ‌లితాల్లో ఆమెకు ఒమిక్రాన్ సోకిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో ఆమె కుటుంబంలో ఆరుగురు స‌భ్యుల‌కు క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. వారంద‌రికి నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఆమెను క్వారంటైన్ త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. ఇక ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజ‌య‌న‌గ‌రంలో జిల్లాలో న‌మోదు అయిన సంగ‌తి తెలిసిందే.


'ఈనెల 10వ తేదీన కెన్యా నుంచి మహిళ చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడ్నుంచి కారులో తిరుపతికి వచ్చింది. 12వ తేదీన తిరుపతిలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడంతో ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ త‌ర‌లించాం. కాగా.. ఇవాళ వచ్చిన రిపోర్టుల్లో ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ఆమె కుటుంబంలోని ఆరుగురికి ప‌రీక్ష‌లు చేశాం. వారంద‌రికి నెగెటివ్ రిపోర్టు వ‌చ్చింది. ఆమెను క్వారంటైన్‌కు త‌రలించాం. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. 'అనిఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఇక దేశంలో ఈ రోజు ఉద‌యం వ‌ర‌కు 213 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అత్య‌ధికంగా ఢిల్లీలో 57, మ‌హారాష్ట్ర‌లో 54 న‌మోదు కాగా.. ఆ త‌రువాత తెలంగాణలో 24 కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 90 మంది కోలుకున్నారు.

Next Story