ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. ఎన్నికల సంఘం తప్పకుండా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటూ ఉండగా.. మరో వైపు ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉందంటూ ప్రభుత్వం చెబుతూ ఉంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సంఘం జేడీ జీవీ సాయిప్రసాద్ పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 30 రోజుల సెలవుపై వెళ్లడమే కాకుండా, ఇతర ఉద్యోగులను కూడా సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని సాయిప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి.


ఏపీ ఎన్నిక‌ల సంఘం జాయింట్ డైరెక్ట‌ర్ జీవీ సాయి ప్ర‌సాద్‌పైను విధుల‌నుంచి తొల‌గించారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా ఎవ‌రూ సెల‌వుపై వెళ్ల‌వొద్ద‌ని ఎస్ ఈసీ ర‌మేష్ కుమార్ ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. కానీ జీవీ సాయి ప్రసాద్ 30రోజుల పాటు సెలవులపై వెళ్లారు. అంత‌టితో ఆగ‌కుండా ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని జీవీ సాయి ప్రసాద్‌పై అభియోగాలు ఉన్నాయి. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఎన్నికల కమిషన్ క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించింది. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా ప్ర‌సాద్ చర్యలున్నాయని ఎస్ఈసీ పేర్కొంది. జీవీ సాయిప్రసాద్‌ను ‌విధుల నుంచి తొలగించింది.

ఎస్ఈసీ దీన్ని క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించారు. ముఖ్యంగా, ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా సాయిప్రసాద్ చర్యలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం అతడిని విధుల నుంచి తొలగిస్తున్నామని ఎస్ఈసీ తాజాగా ప్రకటించారు. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలులేదని ఎస్ఈసీ ర‌మేష్ కుమార్ తేల్చిచెప్పారు.
సామ్రాట్

Next Story