ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నిన్న ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍పై క్రమశిక్షణ చర్యలు చర్యలు తీసుకున్న ఆయ‌న‌.. తాజాగా ఎన్నికల సంఘం సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖ రాశారు. వాణీమోహన్‌ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని లేఖలో తెలిపారు. వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలావుంటే.. సోమ‌వారం నాడు ఎన్నికల సంఘం జేడీ జీవీ సాయిప్రసాద్ పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 30 రోజుల సెలవుపై వెళ్లడమే కాకుండా, ఇతర ఉద్యోగులను కూడా సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని సాయిప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఏపీ ఎన్నిక‌ల సంఘం జాయింట్ డైరెక్ట‌ర్ జీవీ సాయి ప్ర‌సాద్‌పైను విధుల‌నుంచి తొల‌గించారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా ఎవ‌రూ సెల‌వుపై వెళ్ల‌వొద్ద‌ని ఎస్ ఈసీ ర‌మేష్ కుమార్ ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు.

కానీ జీవీ సాయి ప్రసాద్ 30రోజుల పాటు సెలవులపై వెళ్లారు. అంత‌టితో ఆగ‌కుండా ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని జీవీ సాయి ప్రసాద్‌పై అభియోగాలు ఉన్నాయి. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఎన్నికల కమిషన్ క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించింది. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా ప్ర‌సాద్ చర్యలున్నాయని ఎస్ఈసీ పేర్కొంది. జీవీ సాయిప్రసాద్‌ను ‌విధుల నుంచి తొలగించింది.
సామ్రాట్

Next Story