నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఎన్నవాడలో సర్పంచి అభ్యర్థిని ఇంటిలో నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఎన్నవాడలో సర్పంచ్ పదవిని 21 లక్షలకు వేలం నిర్వహించారు . ఇరు పక్షాల అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకుని ఏకగ్రీవం చేసుకునేందుకు నిర్ణయించుకోగా.. స్వతంత్ర అభ్యర్థిగా పెంచలయ్య నాయుడు పోటీలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని వేలం పాడిన అభ్యర్థి బెదిరింపులకు దిగారు. తన మాట వినడం లేదనిఇంట్లో పెట్టి తాళం వేసి నిర్బంధించినట్లు స్వతంత్ర అభ్యర్థి పెంచలయ్యనాయుడు, అతని భార్య వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాధారణ ఎన్నికలతో పోల్చితే స్థానిక సంస్థల సంగ్రామం ప్రతిష్ఠాత్మకంగానే ఉంటుంది. వార్డుల్లోని ప్రతి ఇంటి ఓట్లను తమకే దక్కాలని ఆయా పార్టీల అభ్యర్థులు ప్రణాళికలు వేసుకుంటుంటారు. విజయం సాధించేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో భారీస్థాయిలో ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నిబంధనల ప్రకారమే వారు నడుచుకోవాలి. అభ్యర్థులు ఖర్చుపెట్టే ప్రతి రూపాయిని లెక్కచెప్పాల్సిందే. దానికి అనుగుణంగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. సర్పంచి అభ్యర్థితోపాటు, వార్డు సభ్యులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయి.


సామ్రాట్

Next Story