అల్లు అర్జున్, సీఎం రేవంత్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ప్రేరేపించింది కాదని, ఒక హీరోగా అర్జున్ అక్కడికి వెళ్లారని చెప్పారు. ఈ సందర్బంగా ఆదివారం ఆమె ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో మిగిలిన వారిని అరెస్టు చేయకుండా ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల 'పుష్పా -2' సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా 'పుష్పా -2' సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.1,508 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.