నేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్
ఉచిత ఇసుక విధానం అమలులో మరో ముందడుగు పడింది. నేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 11 Sept 2024 8:45 AM ISTనేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్
ఉచిత ఇసుక విధానం అమలులో మరో ముందడుగు పడింది. నేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాండ్ పోర్టల్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. బుధవారం నుంచి ఇసుక బుక్ చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక రూపొందించిన పోర్టల్ తుది పరీక్షా దశలో ఉంది. సైట్ నిర్వహకులకు, ఫిర్యాదులు స్వీకరించే వారికి శిక్షణ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. పోర్టల్ పరీక్షా దశలోనే ఆన్‌లైన్ బుకింగ్ చేపట్టనున్నట్టు సమాచారం. ఇసుక రవాణా చార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గత ప్రభుత్వం విధించిన దానికంటే 30 నుంచి 50 శాతం ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్ తొలి 10 కి.మీలకు రూ.547 వసూలు చేయనున్నట్టు సమాచారం. అయితే ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉందని తెలిసింది. ఆన్‌లైన్ పోర్టల్ పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి ఐదారు రోజులు పట్టొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఇసుక రవాణా, డెలివరీ వంటి అంశాలను వర్చువల్ టైంలో పర్యవేక్షించేలా ప్రత్యేక విధానం అమల్లోకి రానుంది. అటు ఇసుక ఛార్జీలపై కలెక్టర్లు, జిల్లా ఇసుక కమిటీలతో చర్చించాలని ప్రభుత్వం ఆదేశించింది.