ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా వెలుగొందిన సాదినేని యామిని‌.. ఎన్నిక‌ల‌లో టీడీపీ ఓట‌మి అనంత‌రం బీజేపీలో చేరింది. అయితే అప్ప‌టి నుండి ఆమె ఏ ప‌ద‌వి లేకుండానే త‌న గ‌ళం వినిపిస్తుంది. ఇటీవల ఏపీలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్నారు.


తాజాగా ఆమెకు పార్టీ కీలక పదవిని అప్పగించింది. యామినిని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్టు రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు నిర్మలా కిశోర్ నిన్న ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రం విడుదల చేశారు. ఈ విషయాన్ని యామిని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.. తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. తనకు ఈ పదవి దక్కడ సంతోషంగా ఉందన్నారు. తన మీద నమ్మకంతో పదవిని అప్పగించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు.


సామ్రాట్

Next Story