వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంట్లో రచ్చ.. వైసీపీపై టీడీపీ విమర్శలు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఇంట్లో మరోసారి రచ్చ మొదలైంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదని భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు ఆరోపించారు.

By అంజి  Published on  10 Aug 2024 4:57 AM GMT
YCP MLC, Duvvada Srinivas, TDP, YCP, APnews

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంట్లో రచ్చ.. వైసీపీపై టీడీపీ విమర్శలు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఇంట్లో మరోసారి రచ్చ మొదలైంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదని భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు ఆరోపించారు. ఆయన మరో మహిళతో ఉంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న రాత్రి గేటును బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ వీరంగం సృష్టించారు. తన భార్య, పిల్లలపై అర్ధరాత్రి దాడికి దిగారు.

తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నారని దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి ముందు ఆయన భార్య వాణి ఆందోళన చేశారు. దీంతో శ్రీనివాస్‌ ఆగ్రహంతో ఆమెను కొట్టేందుకు వెళ్లారు. గత కొద్దిరోజులుగా దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబాన్ని వదిలేసి వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడని శ్రీనివాస్ భార్య పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. తనను రోడ్డుకి ఈడుస్తావా అంటూ అర్ధరాత్రి తన భార్య పిల్లలపై దాడికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు దువ్వాడను ఆపే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే వారు ఇలా చేస్తున్నారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ ఆరోపించారు.

దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారంపై టీడీపీ విమర్శలు గుప్పించింది. పార్టీ నిండా రౌడీలు, ఖూనీకోరులు, డెకాయిట్లు, సైకోలు, కామాంధులను పెట్టుకుని సేవ్‌ డెమోక్రసీ అంటున్న నిన్ను ఏమనాలి జగన్‌? అసలు నీది రాజకీయ పార్టీయేనా? అని ట్వీట్‌ చేసింది.

Next Story