వాళ్లు 'ఐ-ప్యాక్' స‌భ్యులే.. ప్రజాప్రతినిధులపై నమ్మకం లేకే సీఎం వారిని పంపారు..!

Ruckus in Guntur Municipal Council Meet. గుంటూరు నగర పాలక సంస్థ సమావేశం ర‌సాభాస‌గా మారింది.

By Medi Samrat  Published on  24 Jun 2023 7:14 AM GMT
వాళ్లు ఐ-ప్యాక్ స‌భ్యులే.. ప్రజాప్రతినిధులపై నమ్మకం లేకే సీఎం వారిని పంపారు..!

గుంటూరు నగర పాలక సంస్థ సమావేశం ర‌సాభాస‌గా మారింది. స‌మావేశానికి హాజ‌రైన‌ అధికారులతో పాటే కూర్చున్న‌ ఇద్దరు సభ్యులను టీడీపీ కార్పొరేటర్లు గమనించారు. అనుమానం వచ్చి ఎవరు మీరు అని ప్ర‌శ్నించారు. దీంతో వారు జవాబు చెప్పకుండా బయటికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లకు మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది.

అప్రమత్తమైన వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఆ ఇద్ద‌రు స‌భ్యుల‌కు రక్షణగా నిలబడి బయటకు తీసుకెళ్లి.. మేయర్ ఛాంబర్లో కూర్చోబెట్టాలని భావించారు. మీడియా రావటంతో కార్పొరేషన్‌ హాల్లో ప్రజల గ్యాలరీకి పంపించారు. ఆ తర్వాత అక్కడ మీడియా చిత్రీకరిస్తుండటంతో బయటకు పంపించారు. వారిని ఏమీ చేయవద్దని మేయర్ పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులు కూడా వారి జోలికి వెళ్లలేదు.

వైసీపీ ఐ-ఫ్యాక్ బృందాన్ని స‌మావేశానికి తీసుకొచ్చింద‌ని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న ఐ ప్యాక్‌ టీం సభ్యులు.. ఇప్పుడు నేరుగా అధికారుల మధ్యే కూర్చున్నారని మండిప‌డ్డారు. వైసీపీ ప్రజాప్రతినిధులపై నమ్మకం లేకే సీఎం జగన్ ఐ-ప్యాక్ బృందాన్ని కౌన్సిల్ సమావేశాలకు పంపారని తెలుగుదేశం ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా బయటి వ్యక్తులు సమావేశాల్లో ఎలా పాల్గొంటారని.. టీడీపీ కార్పొరేటర్లు నిలదీశారు. ఐ-ప్యాక్ కి అమ్ముడుపోయిన గుంటూరు మున్సిపల్ కమీషనర్ ని తక్షణమే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.


Next Story