Andhrapradesh: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కదిరి నుంచి బయల్దేరిన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వైఎస్సార్‌ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడింది.

By అంజి  Published on  23 Oct 2024 10:43 AM IST
Andhrapradesh, RTC bus, valley , YSR district, 20 people injured

Andhrapradesh: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కదిరి నుంచి బయల్దేరిన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వైఎస్సార్‌ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడింది. బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన జరిగింది. దీంతో బస్సులో ఉన్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో 30 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story