ఆ డ్రైవర్‌ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకుంటాం: మంత్రి లోకేష్‌

తుని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ సస్పెన్షన్‌ను రద్దు చేస్తామని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. బస్సు ముందు డ్రైవర్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌ కాగా, అతడిని అధికారులు సస్పెండ్‌ చేశారు.

By అంజి  Published on  28 Oct 2024 12:03 PM IST
RTC bus driver, Minister Nara Lokesh, APnews

ఆ డ్రైవర్‌ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకుంటాం: మంత్రి లోకేష్‌

తుని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ సస్పెన్షన్‌ను రద్దు చేస్తామని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. బస్సు ముందు డ్రైవర్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌ కాగా, అతడిని అధికారులు సస్పెండ్‌ చేశారు. దీనిపై ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా లోకేష్‌ స్పందిస్తూ.. 'ఆయనను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకుంటాం. నేను యూఎస్‌ నుంచి తిరిగి వచ్చాక అతడిని వ్యక్తిగతంగా కలుస్తా' అని ఎక్స్‌లో రిప్లై ఇచ్చారు.

కాకినాడ జిల్లా తునిలో ఓ బస్సు డ్రైవర్‌ డాన్స్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే బస్సు డ్రైవర్‌ 'దేవర' సినిమాలోని దావూదీ సాంగ్‌కు స్టెప్పులు వేసి ప్రయాణికులను అలరించారు. ఆర్టీసీ డ్రైవర్‌ డ్యాన్స్‌ వీడియోను షేర్‌ చేస్తూ మంత్రి నారా లోకేష్‌ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. 'బ్రదర్‌ మీ డాన్స్‌ చాలా బాగుంది. ఇలాగే కొనసాగించండి' అని ట్వీట్ చేశారు. బస్సు ప్రయాణికులు ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా ఈ ప్రదర్శనను చూసి ఎంజాయ్‌ చేసి ఉంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

Next Story