నిమ్మ‌గ‌డ్డ‌పై విరుచుకుప‌డ్డ ఎమ్మెల్యే రోజా.. అస‌మ‌ర్థ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అంటూ

Roja shocking comments on SEC Nimmagadda.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2021 1:47 PM GMT
నిమ్మ‌గ‌డ్డ‌పై విరుచుకుప‌డ్డ ఎమ్మెల్యే రోజా.. అస‌మ‌ర్థ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అంటూ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి విరుచుప‌డ్డారు. నిమ్మగడ్డ వైసీపీ ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు టీడీపీ పార్టీని ప్ర‌జ‌లు స‌మాధి చేశార‌ని.. ఇప్పుడు ఆ శ‌వాన్ని బ‌య‌ట‌కు తీసి నిమ్మ‌గ‌డ్డ ప్రాణం పోయ‌లేరు అంటూ ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ అసమర్ధ ఎన్నికల కమిషనర్ అని విమర్శించారు. మార్చి 31 త‌రువాత నిమ్మ‌గ‌డ్డ‌ను కుక్క కూడా ప‌ట్టించుకోదంటూ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలన గానీ, కోవిడ్ టైమ్ లో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదని ప్రజలందరూ అనుకుంటున్న విషయాన్ని నిమ్మగడ్డ తెలుసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు. గుంటూరులో ఏకగ్రీవాలు జరిగిన గ్రామాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించి అడిగి తెలుసుకున్నారని.. తాము ఏకగ్రీవాలు కోరుకుంటున్నామని ప్రజలే చెప్పడంతో.. నిమ్మగడ్డకు మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. చిత్తూరు కలెక్టర్ ని తొలగించి ఎస్ఈసీ తన మనుషులను నియమించుకున్నారు. అయినా జిల్లాలో పంచాయతీ ఏకగ్రీవాలను నిలుపుదల చేయడం చాలా విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు అండ్ కో డైరెక్షన్ లో నిమ్మగడ్డ ముందుకెళ్తున్నారని విమర్శించారు.


Next Story
Share it