ఆ భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Roja Fires On TDP. సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. తిరుపతి ఉపఎన్నిక జరిగిన తీరుపై స్పందించారు.
By Medi Samrat Published on
18 April 2021 8:59 AM GMT

నగరి ఎమ్మెల్యే రోజాకు ఇటీవల సర్జరీ అయిన సంగతి తెలిసిందే. సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. తిరుపతి ఉపఎన్నిక జరిగిన తీరుపై స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ ఈ ఎన్నికలో ఒక్క రూపాయి కూడా పంచకుండా, మద్యం ఇవ్వకుండా, ప్రలోభాలకు గురి చేయకుండా కొత్త సంప్రదాయానికి తెర లేపారని ప్రశంసించారు. పాలన ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా ఓటర్ల మనసును జగన్ గెలిచారన్నారు.
ప్రతిపక్ష టీడీపీ ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే.. దొంగ ఓట్ల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రచారం చేయటం వల్ల తమ పార్టీ ప్రతిష్ట ఏ మాత్రం దిగజారదన్నారు. మిగిలిన చోట్ల ఇటువంటి ప్రచారమేది లేకుండా.. కేవలం తిరుపతిలో మాత్రమే ఎందుకు దొంగ ఓట్లు అంటున్నారని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డిపై కక్షసాధింపుతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దొంగ ఓటర్లను పోలింగ్ బూతుల్లో ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.
Next Story