ఓ ప్రమాదం బస్సు ప్రయాణికులను కాపాడింది. అవును మీరు చదువుతుంది కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. ప్రమాదం జరగకపోయుంటే మాత్రం ఘోర అనర్ధం జరిగేది. ఎంతో మంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చేది. వారిని ఓ ట్రాన్స్ పోర్ట్ లారీ రూపంలో భగవంతుడే కాపాడాడు అని చెప్పాలి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం మునుగోడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఇక అదే సమయంలో నరసరావుపేట వైపు నుంచి వెళ్తున్న నవత ట్రాన్స్‌పోర్ట్ లారీ అనుకోని విధంగా ఆ బస్సుకు ఢీకొట్టింది.
దీంతో బస్సు అక్కడికక్కడ ఆగిపోయి ప్రమాదం నుంచి తప్పుకుంది. లేదంటే భారీ ప్రమాదం చూడవలసి వచ్చేదని ప్రయాణికులు చెప్తున్నారు. అయితే నవతా ట్రాన్స్‌పోర్ట్ లారీ ప్రమాదం రూపంలో బస్సును ఢీకొనడంతో పెను ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడినట్లు అయింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పెట్లూరు వారి పాలెం ఉప్పలపాడు మధ్య చోటు చేసుకుంది. లారీ డ్రైవర్‌కి ఎలాంటి గాయాలు అవలేదు. లారీ ముందు భాగం కొంతమేర దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.