ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద కంటైనర్‌ను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో ఈ ప్రమాదం సంభవించింది. నల్లజర్ల వైపు నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి బాలుడు చికిత్స పొందుతున్నాడనీ... పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
అతివేగంగా వెళ్లడంతో కారు రోడ్డు ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయ్యింది. దాంతో.. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. వాటిని బయటకు తీసేందుకు పోలీసులు, సహాయక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అతికష్టం మీద మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ఆ తర్వాత పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తు కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మృతులను భాగ్యశ్రీ, కమలాదేవి, నితిన్ కుమార్‌గా గుర్తించారు. వీరంతా హైదరాబాద్ వాసులని చెప్పారు.