రిప్‌ కాపులు.. కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు: ఆర్జీవీ

RGV makes controversial tweet on Jana Sena chief Pawan Kalyan. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వివాదాలకు కేరాఫ్. ఎలాంటి సంకోచం లేకుండా

By అంజి  Published on  9 Jan 2023 1:02 PM IST
రిప్‌ కాపులు.. కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు: ఆర్జీవీ

టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వివాదాలకు కేరాఫ్. ఎలాంటి సంకోచం లేకుండా వ్యాఖ్యలు చేయడం, భావాలను వ్యక్తం చేయడం వంటి విషయాల్లో సినీ నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో ఆయన అందరికంటే ప్రత్యేకంగా నిలుస్తారు. ఆదివారం నాడు చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీపై తాజాగా షాకింగ్ ట్వీట్ చేసి టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు.

ఆర్జీవీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. డబ్బు కోసం పవన్ తన సొంత కాపుల్ని కమ్మల కోసం అమ్ముతాడని తాను ఊహించలేదని ఆర్జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. అతను ఇంకా "రిప్‌ కాపుస్.. కంగ్రాట్స్ కమ్మస్" అని రాశాడు. కాగా వర్మ ట్వీట్ పై జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆర్జీవీ ట్వీట్‌పై స్పందించిన టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న.. ఆర్జీవీ కామంతో కాళ్లు నొక్కుతాడని తనకు తెలుసు కానీ డబ్బు కోసం అతను ఏదైనా చేయగలడని ఊహించలేదని ఉదహరించారు. రిప్‌ ఆర్జీవీ, జగన్ రెడ్డికి అభినందనలు అంటూ ట్వీట్‌ చేశారు.


Next Story