వైఎస్ జగన్‌తో సినిమా అన్న పవన్ కళ్యాణ్.. కౌంటర్ వేసిన ఆర్జీవీ

ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ పెట్టారు. ఆయన మన ఏపీ సీఎంతో ఎవరైనా ఈ సినిమా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 May 2023 11:30 AM IST
RGV, Pawan Kalyan, tweet , YS Jagan, Movie

వైఎస్ జగన్‌తో సినిమా అన్న పవన్ కళ్యాణ్.. కౌంటర్ వేసిన ఆర్జీవీ 

ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ పెట్టారు. ఆయన మన ఏపీ సీఎంతో ఎవరైనా ఈ సినిమా తీస్తారని ఆశిస్తున్నానంటూ 'పాపం పసివాడు' అనే ఓ చిత్రం పోస్టర్ ను పెట్టారు. అందులో ఓ చిన్న పిల్లాడు సూట్ కేసును పట్టుకుని ఉంటాడు.

దీన్ని ఉదాహరణగా చేసుకుని పవన్ కళ్యాణ్ ట్వీట్ వేశారు. పిల్లాడి స్థానంలో జగన్ మోహన్ రెడ్డి ఉండాలని చెప్పుకొచ్చారు. ‘మన ఏపీ సీఎంతో ఎవరైనా ‘‘పాపం పసివాడు’’ సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. అతను చాలా అమాయకుడు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం. అతని చేతిలో 'సూట్‌కేస్'కి బదులుగా, అతని అక్రమ సంపద కోసం మనీలాండరింగ్‌ని సులభతరం చేసే బహుళ 'సూట్‌కేస్ కంపెనీలను' ఉంచండి. ప్రియమైన ఏపీ సీఎం... మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగి రెడ్డి కాదు. మీరు అక్రమంగా సంపాదించిన సంపదతో, ప్రజలపై విరుచుకుపడే హింసతో 'వర్గయుద్ధం' అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు. ఏదో ఒక రోజు 'రాయలసీమ' మీ నుంచి, మీ గుంపు బారి నుంచి విముక్తి పొందుతుందని ఆశిస్తున్నాను. పాపం పసివాడు సినిమా కథనానికి రాజస్థాన్ ఎడారి ఇసుక దిబ్బలు కావాలి, కానీ ఇసుకను ఏపీలో నది ఒడ్డున వైసీపీ దోచుకుంది. కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి. చీర్స్!!’’ అంటూ పోస్టు పెట్టాడు.

దీనికి వెంటనే స్పందించారు ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ. మీ అమాయకత్వం మీద కూడా సినిమా తీస్తారని ఆశిస్తూ ఉన్నానని రామ్ గోపాల్ వర్మ అన్నారు. మీరు ఎంతో అజ్ఞానంగా అమాయకంగా ఉన్నందున ఎవరైనా మీతో కూడా ఈ సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం.. ఒక పాత్రను పోషించే బదులు, ఒక పాత్రలో బహుళ వ్యక్తిత్వాలు పోషించండని అన్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్టీ రామా రావు కాదు MGR కాదు ..నీకు ప్రజాసేవ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు .. మీకున్న దురుద్దేశంతో మీ అమాయక అభిమానులను రెచ్చగొడుతూ ఉంటారు ..ఏదో ఒక రోజు మీ జన సైనికులు మీ నుండి, మీ మానసిక నార్సిజం నుండి విముక్తి పొందాలని ఆశిస్తున్నాను..... ఈ కథనానికి రాజస్థాన్ ఎడారిలోని ఇసుక దిబ్బలు కావాలి, కానీ కొన్ని థియేటర్ కలెక్షన్ పాయింట్‌లలో మీకు కొంతమంది అమాయక అనుచరులు ఉన్నందున వారి మనస్సులను దోచుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై అబద్ధాలు విసరడానికి మీకు హైదరాబాద్ అవసరం. చీర్స్!! అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వేశారు.

Next Story