నామినేటెడ్ పోస్టుల్లోని నేతల రాజీనామాలు..!

ప్రభుత్వాలు మారగానే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారు రాజీనామాలు చేయడం మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం.

By Medi Samrat  Published on  4 Dec 2023 6:15 PM IST
నామినేటెడ్ పోస్టుల్లోని నేతల రాజీనామాలు..!

ప్రభుత్వాలు మారగానే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారు రాజీనామాలు చేయడం మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి రాజీనామాల పర్వాలు కొనసాగుతూ ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు తమ పోస్టులకు రాజీనామా చేస్తున్నారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా ఉన్న దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రీజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2014 జూన్ 5న జెన్ కోం సీఎండీగా పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ రావు, అదే సంవత్సరం 25న ట్రాన్స్ కో ఇంఛార్జ్ గా ప్రభుత్వం నియమించింది. ప్రభాకర్ రావు జెన్ కో సంస్థకు మొత్తం 54 ఏళ్ల పాటు తన సేవలను అందించారు. సాంస్కృతిక సలహాదారుడిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ రమణాచారి కూడా తన పదవికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్‌ శాంతికుమారికి పంపించారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు, ఎమ్మెల్సీ కవిత తదితరులు హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.

Next Story