Video: 'నా కూతురిని కాపాడండి' వార్తలో వాస్తవం లేదు: ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం

ఇటీవల ఒక దినపత్రికలో 'నా కూతురిని కాపాడండి' అనే శీర్షికతో ప్రచురితమైన వార్తలో ఎలాంటి వాస్తవం లేదని...

By -  అంజి
Published on : 19 Feb 2026 6:59 AM IST

Renigunta News, Fact Check, Police Clarification, Renigunta Girl Safe, False Allegations

Video: 'నా కూతురిని కాపాడండి' వార్తలో వాస్తవం లేదు: ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం

ఇటీవల ఒక దినపత్రికలో 'నా కూతురిని కాపాడండి' అనే శీర్షికతో ప్రచురితమైన వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం విచారణలో స్పష్టమైంది. రేణిగుంటకు చెందిన ఒక మహిళ తన కుమార్తెను ఎవరో వ్యభిచార కూపంలోకి దించారని, పోలీసులు పట్టించుకోవడం లేదని చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేలింది. సదరు మహిళ ఫిర్యాదుపై పోలీసులు తక్షణమే స్పందించి కూలంకషంగా విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో సదరు యువతి ఆచూకీని కనుగొని, పోలీసులు ఆమెతో నేరుగా మాట్లాడారు. యువతి తన తల్లితో ఉన్న మనస్పర్థలు, విభేదాల కారణంగానే ఇంట్లో ఉండటం లేదని తెలిసింది. గతంలో ఆమె రేణిగుంటలోని ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ హాస్టల్‌లో ఉండేవారు. సదరు మహిళ తరచూ ఆ సంస్థకు వెళ్లి గొడవ చేస్తుండటంతో, యాజమాన్యం ఆ యువతిని ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం ఆ యువతి బెంగళూరులోని ఒక ప్రతిష్టాత్మక సంస్థలో గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకుంటూ క్షేమంగా ఉన్నారు.

తన తల్లికి మతిస్థిమితం సరిగా లేదని, ఆమె చేసే ఆరోపణలను పట్టించుకోవద్దని ఆ యువతి పోలీసులకు వివరించారు. తన తల్లి కావాలనే ఇతరులపై నిందలు వేస్తోందని, తన క్షేమం పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదని ఆమె స్పష్టమైన వాగ్మూలం ఇచ్చారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం ఒక వ్యక్తి ఇచ్చిన తప్పుడు సమాచారంతో ప్రచురితమైన ఆ వార్త బాధితురాలి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఈ కేసును వాస్తవాల ఆధారంగా పరిష్కరించింది.

Next Story