పోసానికి ఏపీ హైకోర్టులో ఊరట

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది.

By Medi Samrat
Published on : 10 April 2025 3:44 PM IST

పోసానికి ఏపీ హైకోర్టులో ఊరట

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారన్న కేసులో సూళ్లూరుపేట పోలీసులు పోసానిని విచారణకు పిలిచారు. అయితే ఈ కేసులో తదుపురి చర్యలు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. సూళ్ళూరు పేట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి పెట్టిన సెక్షన్లపై సీఐ మురళీ కృష్ణకు ఫాం-1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల 24కి పోసాని పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. పోసాని కృష్ణ మురళి గత నెలలో జైలులో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చారు.

Next Story