ఏపీలో మిగిలిపోయిన బార్లకు ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఖాళీగా ఉన్న 432 బార్ల (428 ఓపెన్, 4 రిజర్వు) లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 924 బార్ల (840 ఓపెన్, 84 రిజర్వు) లైసెన్సు జారీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించగా, మద్యం వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో 492 (412 ఓపెన్, 80 రిజర్వు) బార్లకు మాత్రమే లైసెన్సులు ఖరారు చేశారు. మిగిలిన బార్లకు నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ నిర్వహించలేదు.
ఈ నేపథ్యంలో మిగిలిన బార్లను భర్తీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ రీ-నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 15వ తేదీ ఉదయం జిల్లా కలెక్టరేట్‌లలో ఉదయం 8 గంటల నుంచి లాటరీ నిర్వహించి లైసెన్సుదారులను ఖరారు చేస్తారు.