ఏపీలో రేపటి నుంచి వాళ్లకు రేషన్ బంద్?
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik
ఏపీలో రేపటి నుంచి వాళ్లకు రేషన్ బంద్?
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఇవాళ సాయంత్రం లోపు ఈకేవైసీ చేయించుకోవాలని తెలిపింది. ఈకేవైసీ పూర్తి చేయకుంటే ప్రభుత్వ పథకాలు నిలిచిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఐదేళ్ల లోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు కేవైసీ అవసరం లేదని స్పష్టం చేసింది. గడువు మరోసారి పొడిగించే అవకాశం లేదని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవడానికి రేషన్ షాపులు, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ ఆపరేటర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయాల్లో ఈ సదుపాయం కల్పించారు
గతంలో చాలా మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, వేరే ప్రాంతాల్లో చదువుకుంటున్నవాళ్లు, అలాగే పరీక్షల వల్ల ఈకేవైసీ చేసుకోలేకపోయారు. వాస్తవానికి మార్చి 31న గడువు ముగియగా.. ప్రజల ఇబ్బందుల్ని గమనించి ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించింది. ఇటీవల చాలా మంది రేషన్ కార్డుదారులు చనిపోయారు.. వారి పేర్లను ఇంకా తొలగించలేదు. చాలా మంది చిరునామాలు కూడా మారిపోయాయి.. అందుకే ఈకేవైసీ తప్పనిసరి చేశారు. అడ్రస్ మారినప్పటికీ, రేషన్ ఎక్కడ తీసుకుంటున్నారో అక్కడే ఈకేవైసీ చేయించుకోవచ్చు అని ప్రభుత్వం తెలిపింది.