సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ -తెలంగాణ మధ్య ప్రయాణించే లక్షలాది మందికి ఊరట కల్పించాలని, పండుగ వారం రోజులు ఈ మార్గంలో టోల్ వసూళ్లు రద్దు చేసి ‘టోల్ ఫ్రీ’ ప్రయాణానికి అనుమతివ్వాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరిన రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కోరారు.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై పతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, కీసర టోల్ ప్లాజాల వద్ద పండుగ రద్దీతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారి ప్రయాణాన్ని సుఖమయం చేయవల్సిందిగా విజ్ఞాప్తి చేస్తున్నానని. ఈ పండుగ సమయంలో మీరు చేసే ఉపకారం తెలుగు ప్రజలు ఎప్పటికి మరచిపోరు అని తెలిపారు.