అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది.

By -  Medi Samrat
Published on : 2 April 2026 7:40 PM IST

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో చర్చ అనంతరం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఈ బిల్లుపై చర్చను ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story