అలర్ట్..ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది.

By -  Knakam Karthik
Published on : 25 Jan 2026 7:57 AM IST

AndhraPradesh, Weather News, Rain Alert, APSDMA

అలర్ట్..ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వంటి దక్షిణ కోస్తా మరియు రాయలసీమ జిల్లాల్లో, అలాగే కొన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో, 25-26 జనవరి 2026 తేదీలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని, ఆకాశం మేఘావృతమై చలి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. అటు పలు చోట్ల చలి తీవ్రత కొనసాగుతోంది.

Next Story