Rain Alert : రేపు ఆ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

Rain Alert For Andhra Pradesh. రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవ‌కాశం

By Medi Samrat  Published on  17 March 2023 7:30 PM IST
Rain Alert : రేపు ఆ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

Rain Alert For Andhra Pradesh



రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చ‌రించింది. అలాగే.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంద‌ని పేర్కొంది. భారీ వర్షాలు, పిడుగుపాటు నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించింది. ఉరుములతో కూడిన వర్షాలు ఉన్నందున రైతులు పొలాల్లో, చెట్ల క్రింద ఉండరాదని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.




Next Story