రెయి‌న్‌ అలర్ట్.. ఏపీలో ఈ రెండు రోజులు వ‌ర్షాలు

Rain Alert For Andhra Pradesh.శుక్రవారం ఉదయం నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశ‌మున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది

By Medi Samrat  Published on  19 Feb 2021 2:11 PM IST
Rain Alert For Andhra Pradesh
శుక్రవారం ఉదయం నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశ‌మున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు.. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడొచ్చని తెలియ‌జేసింది. ఏపీపై ఉపరితల ఆవర్తనం ప్రభావం కార‌ణంగా శుక్ర, శనివారాల్లో జిల్లాల్లో వానలు కురుస్తాయ‌ని పేర్కొంది. ఓ ప‌క్క‌ తెలంగాణలోనూ ప‌లుచోట్ల‌ నిన్న‌టి నుండి వర్షాలు కురుస్తున్నాయి


ఆంధ్రప్రదేశ్‌ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో శుక్రవారం దక్షిణ కోస్తాలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శనివారం ఉత్తర కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడొచ్చని సూచించారు.

శుక్రవారం ఉదయం నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పంటలు చేతికి అందివచ్చే సమయం కావడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. తేలికపాటి జల్లులు అయితే సమస్యలేదని.. భారీ వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవంటున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా వానలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుండి ఇలా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.


Next Story