కాలువల్లో చెత్త వేస్తే జరిమానా? 'ఫొటో కొట్టు ప్రైజ్ పట్టు' అంటోన్న ఏపీ డిప్యూటీ స్పీకర్

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రజలకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరిక జారీ చేశారు.

By Knakam Karthik
Published on : 24 March 2025 6:30 AM IST

Andrapradesh, Ap Deputy Speaker Raghurama Krishnaraju, Pollution In Undi

కాలువల్లో చెత్త వేస్తే జరిమానా? 'ఫొటో కొట్టు ప్రైజ్ పట్టు' అంటోన్న ఏపీ డిప్యూటీ స్పీకర్

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రజలకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరిక జారీ చేశారు. ఉండి నియోజకవర్గంలో ఎవరైనా పంట కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను వేస్తే వారికి రూ.1000 జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రఘురామ వెల్లడించారు.

ఈ జరిమానా ద్వారా వచ్చిన మొత్తాన్ని కెనాల్ డెవలప్ మెంట్ ఫండ్ (కాలువ అభివృద్ధి నిధి)కి జమ చేసి, పంట కాలువలను శుభ్రం చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు. అయితే, జరిమానా కట్టే పరిస్థితి రాకుండా ప్రజలందరూ కాలువలను శుభ్రంగా ఉంచుతారని ఆశిస్తున్నానని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Next Story