క్వాంటం కంప్యూటింగ్‌ అంటే?.. దీంతో నిరుద్యోగులకు లాభం ఏంటి?

అమరావతిలో క్వాంటం వ్యాలీకి నిన్న శంకుస్థాపన పడిన వేళ.. క్వాంటం కంప్యూటింగ్‌ అంటే ఏమిటి అనే చర్చ మొదలైంది.

By -  అంజి
Published on : 8 Feb 2026 11:40 AM IST

Amaravati Quantum Valley, Amaravati, quantum computing, unemployed

క్వాంటం కంప్యూటింగ్‌ అంటే?.. దీంతో నిరుద్యోగులకు లాభం ఏంటి?

అమరావతిలో క్వాంటం వ్యాలీకి నిన్న శంకుస్థాపన పడిన వేళ.. క్వాంటం కంప్యూటింగ్‌ అంటే ఏమిటి అనే చర్చ మొదలైంది. ఇది సంప్రదాయ కంప్యూటర్లకు మించిన శక్తిమంతమైనవి. ఇప్పటి కంప్యూటర్లు 0, 1 బిట్లపై పని చేస్తే.. క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్‌పై ఆధారపడతాయి. క్యూబిట్‌ ఒకేసారి 0, 1 గా ఉండగలగడం వల్ల అత్యంత వేగంగా పని చేస్తాయి. మామూలు కంప్యూటర్లు కొన్ని ఏళ్లు చేసే పనిని ఇవి సెకన్లలోనే చేస్తాయి.

క్వాంటం వ్యాలీ ద్వారా నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టుతో దాదాపు లక్ష ఉద్యోగాలు వస్తాయని భావిస్తోంది. యువతకు క్వాంటం టెక్నాలజీలో ట్రైనింగ్‌ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తామని చెప్తోంది. ఐఐటీలు, గ్లోబల్‌ కంపెనీల భాగస్వామ్యంతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సాగనుందని, విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతే టెక్‌ కెరీర్‌ కేంద్రంగా మారనుందని తెలిపింది.

క్వాంటం టెక్నాలజీతో భవిష్యత్‌ నాయకత్వానికి శంకుస్థాపన చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 'ఇది అమరావతికే కాదు.. దేశానికే గేమ్ ఛేంజర్‌ అవుతుంది. సిలికాన్‌ వ్యాలీ అనేది గతం. ఇకపై క్వాంటం వ్యాలీ గురించే మాట్లాడుకుంటారు. క్వాంటం కంప్యూటర్లు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తాం. దావోస్‌లో ఏఐ, గ్రీన్‌ ఎనర్జీ మీద చర్చ జరిగింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీని కూడా ఎస్టాబ్లిష్‌ చేయబోతున్నాం' అని తెలిపారు.

Next Story