కర్నూలు బస్సు ప్రమాదం.. రోడ్డుపై ద్విచక్ర వాహనదారుడి మృతదేహం
కర్నూలు జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్స్ అగ్ని ప్రమాదం ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు
By - Knakam Karthik |
బస్సు ఢీకొన్న పల్సర్ వాహనదారుడు శివశంకర్ మృతి
కర్నూలు జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్స్ అగ్ని ప్రమాదంలో 23 మంది సజీవధహనమవగా.. ఓ ద్విచక్ర వాహనదారుడు మృతదేహం రోడ్ పై గుర్తించారు. పెళ్లిచూపులు చూస్తున్న ఈ సమయంలో తన కొడుకు మరణించాడు అన్న వార్త వినగానే ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. ఈరోజు తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అత్యంత వేగంగా వెళుతున్న సమయంలో కర్నూల్ నగర సమీపంలో ఉన్న ఉలిందపల్లి గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బస్సు లో మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది.
అయితే ట్రావెల్ బస్సు.. బైక్ను ఢీ కొట్టిన అనంతరం 300 మీటర్ల వరకు లాక్కెళ్ళింది. దీంతో బైక్ నుండి పెట్రోల్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో దాదాపు 23 మంది సజీవ దానం అయినట్లుగా సమాచారం... అయితే ఈ ఘటనలో బైక్ నడిపిన యువకుడు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.. కర్నూలు జిల్లాలోని ప్రజా నగర్ కు చెందిన శివశంకర్ (20) అనే యువకుడు పల్సర్ బైక్ పై వెళ్తున్న సమయంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్ ఢీకొట్టడంతో మరణించినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే అతడు అంతకుముందే ప్రమాదానికి గురై ఉండవచ్చన్న వాదనలు లేకపోలేదు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అయితే.. పెళ్లిచూపులు చూస్తున్న ఈ సమయంలో శివ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అసలు ఆ సమయంలో శివ అక్కడికి ఎందుకు వెళ్ళాడో మాకు అర్థం కావడం లేదు అంటూ.. కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.