ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అయిన నిర్మాతలు

రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు.

By Medi Samrat
Published on : 11 Aug 2025 2:02 PM IST

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అయిన నిర్మాతలు

రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సినీ రంగ సమస్యలు, సినీ కార్మికుల ఆందోళనపై మంత్రి దుర్గేష్ కు నిర్మాతలు వినతిపత్రం అందించారు. అనంత‌రం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి నిర్మాతలు వస్తామన్నారు.. రమ్మన్నాం.. ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని తెలిపారు. ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు, సినీ నిర్మాతలకు ఇరువురు చెప్పే విషయాలు వింటాం అని మంత్రి పేర్కొన్నారు.

సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తామన్నారు. ప్రభుత్వ జోక్యం అవసరం అయితే సీఎం, డిప్యూటీ సీఎం ల స్థాయిలో నిర్ణయం తీసుకుంటార‌న్నారు. ఈ అంశంపై ఫెడరేషన్‌, ఛాంబర్‌ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము.. మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తామ‌న్నారు. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్ లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామ‌న్నారు.

Next Story