దెందులూరు వ‌ద్ద బ‌స్సు బోల్తా.. 11 మందికి గాయాలు

ఏలూరు జిల్లా దెందులూరు వ‌ద్ద ఓ ప్రైవేటు బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 11 మందికి గాయాలు అయ్యాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2023 9:50 AM IST
Private Travels Bus, Eluru

ప్ర‌మాదానికి గురైన బ‌స్సు



ఏలూరు జిల్లా దెందులూరు వ‌ద్ద ఓ ప్రైవేటు బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 11 మందికి గాయాలు అయ్యాయి.

ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సు హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరింది. మంగ‌ళ‌వారం ఉద‌యం దెంద‌లూరు వ‌ద్ద‌కు చేరుకునేస‌రికి అదుపు త‌ప్పి 16వ నెంబ‌రు జాతీయ ర‌హ‌దారిపై బోల్తా ప‌డింది. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 25 మంది ప్ర‌యాణీకుల‌తో పాటు ముగ్గురు డ్రైవ‌ర్లు ఉన్నారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు.


గాయ‌ప‌డిన వారిని ఏలూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story