ఏపీ వ్యాప్తంగా నేడు ప్రైవేట్ స్కూళ్లు బంద్..ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ ప్రైవేట్ స్కూళ్లు మూతపడనున్నాయి.
By Knakam Karthik
ఏపీ వ్యాప్తంగా నేడు ప్రైవేట్ స్కూళ్లు బంద్..ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇవాళ ప్రైవేట్ స్కూళ్లు మూతపడనున్నాయి. ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా గురువారం స్కూళ్ల బంద్ పాటిస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తమ ఆవేదనను తెలిపేందుకే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని వెల్లడించాయి.
కాగా కొందరు క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చే అగౌరవకరమైన మెసేజ్‌లు, హెచ్చరికలు మమ్మల్ని ఆవేదనకు గురి చేస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ నిత్యం తనిఖీ చేయడం, యాజమాన్యాలపై అతిగా స్పందించడం దురదృష్టకరం. ఆర్టీఈ ప్రవేశాల్లో తగిన ధ్రువీకరణ లేకుండా చేర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. పాఠశాలలకు షోకాజ్ నోటీసులతో వేధించడం సహా గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు..అని ప్రైవేట్ యాజమాన్యాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలోనే అధికారుల తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ బంద్ పాటిస్తున్నట్లు యాజమాన్యాలు తెలిపాయి. బంద్‌కు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు సందేశాలు పంపించినట్లు వెల్లడించాయి.