జులై 4న భీమవరానికి ప్రధాని

Prime Minister Modi will arrive in Bhimavaram on July 4.ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జులై 4న

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 29 May 2022 5:25 AM

జులై 4న భీమవరానికి ప్రధాని

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జులై 4న ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు తెలియ‌జేశారు. శ‌నివారం ఆయ‌న ఆకివీడులోని ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం స్థానిక నాయ‌కుల‌తో మాట్లాడారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో జరిగే జయంతి కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారు.

జూన్ 7న రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌ర‌గ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా పాల్గొంటార‌ని సోము వీర్రాజు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అనుస‌రించాల్సిన విధివిధానాల‌పై నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

Next Story