రాజకీయ వ్యాఖ్యల వివాదం..ఏపీ డిప్యూటీ స్పీకర్‌పై విచారణకు రాష్ట్రపతి ఆదేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై విచారణ జరపాలని భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి ఆదేశాలు అందాయి.

By -  Knakam Karthik
Published on : 2 April 2026 8:00 AM IST

AndhraPradesh, RaghuRamaKrishnaRaju, PresidentOfIndia, AP Politics, ConstitutionalPost, APAssembly, PoliticalControversy

రాజకీయ వ్యాఖ్యల వివాదం..ఏపీ డిప్యూటీ స్పీకర్‌పై విచారణకు రాష్ట్రపతి ఆదేశం

విజయవాడ: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ ప్రకటనలు చేసినందుకు ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణ రాజుపై విచారణ ప్రారంభించాలని కోరుతూ భారత రాష్ట్రపతి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి ఒక ప్రకటనను పంపింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జై భీమ్ రావు భారత్ పార్టీ ప్రతినిధి పి. సురేష్ కుమార్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

తొలుత ఫిర్యాదు చేసినప్పుడు తగిన స్పందన లేకపోవడంతో సురేష్ కుమార్ మరోసారి రాష్ట్రపతి కార్యాలయాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి భవన్, డిప్యూటీ స్పీకర్ వ్యవహారశైలిపై విచారణ ప్రారంభించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌ను ఆదేశించింది. ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై నేరుగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి విచారణకు ఆదేశాలు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Next Story