లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌ను ప్ర‌శ్నించిన‌ ప్రకాష్ రాజ్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ గురించి తెలిసి షాక్ అయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ వేశారు.

By Medi Samrat  Published on  21 Sept 2024 7:44 AM IST
లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌ను ప్ర‌శ్నించిన‌ ప్రకాష్ రాజ్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ గురించి తెలిసి షాక్ అయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ వేశారు. నెయ్యి తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చేపట్టామన్నారు. సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.

పవన్ కళ్యాణ్ పోస్టుకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కౌంటర్ కామెంట్స్ చేశారు. డియర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది కాబట్టి దయచేసి విచారించాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ సూచించారు. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు, సమస్యను జాతీయ స్థాయిలోకి ఎందుకు తీసుకుని వెళుతున్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. (కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు) అని ప్రకాష్ రాజ్ అన్నారు.

కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలను మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. బయట ప్రపంచానికి తప్పుడు మెసేజ్‌ను పంపుతున్నామని జగన్ అన్నారు. బురద వేయాలనే దుర్బుద్ధితోనే చేస్తున్నారనీ, చంద్రబాబు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమన్నారు. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయన్నారు.


Next Story