'ఎవరైనా చెప్పండి ప్లీజ్'.. పవన్‌ కల్యాణ్‌కు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్‌

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. తమిళనాడులో జరుగుతున్న భాష వివాదంపై పరోక్షంగా స్పందించారు.

By అంజి
Published on : 15 March 2025 8:45 AM IST

Prakash Raj ,Pawan Kalyan, Hindi language controversy, Tamil Nadu

'ఎవరైనా చెప్పండి ప్లీజ్'.. పవన్‌ కల్యాణ్‌కు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్‌

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. తమిళనాడులో జరుగుతున్న భాష వివాదంపై పరోక్షంగా స్పందించారు. కొందరు భాష, సంస్కృతినీ తిడుతున్నారని.. హిందీని రుద్దుతున్నారంటా హడావుడి చేస్తున్నారని అన్నారు. 'అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దని అంటున్నారు. అలాగైతే తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి.. హిందీవాళ్ల డబ్బులు కావాలి.. కానీ హిందీ భాష వద్దంటే ఎలా?, భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. దేశానికి తమిళం సహా బహుళ భాషలు కావాలి.. బహుభాషలే దేశానికి మంచిది' అని పవన్‌ అన్నారు.

ఈ క్రమంలోనే పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కామెంట్స్‌ చేశారు. ''మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్‌...'' అంటూ కౌంటర్‌ ఇచ్చారు. గతంలో కూడా ప్రకాష్ రాజ్.. పవన్‌ కల్యాణ్‌కు కౌంటర్లు ఇచ్చారు. తిరుమల లడ్డూ వ్యవహారం, సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

Next Story