ట్విటర్ డీపీ మార్చిన పవన్ కల్యాణ్.. నెట్టింట్లో ట్రెండ్

Powerstar Pawan Kalyan changed Twitter DP. తాజాగా పవన్‌ కల్యాణ్ తన ట్విటర్ అకౌంట్‌లో కామన్ డీపీ మార్చారు. జనసేన జెండా బ్యాక్‌ డ్రాప్‌లో నిల్చొని

By అంజి  Published on  9 July 2022 1:16 PM IST
ట్విటర్ డీపీ మార్చిన పవన్ కల్యాణ్.. నెట్టింట్లో ట్రెండ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ అంటే ఫ్యాన్స్‌కు ఎంత పిచ్చో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవనే. ఆయన బయటకు వస్తున్నాడంటే రోడ్లన్నీ కిక్కిరిసిపోతుంటాయి. ఆయన సినిమా రిలీజ్‌ అయ్యిందంటే ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. పవన్‌ చేసే ప్రతి పని హాట్‌ టాపిక్‌గా, వైరల్‌గా మారుతుంటుంది. ఆ స్థాయిలో పవన్ ఫ్యాన్స్ రచ్చ చేస్తుంటారు.

తాజాగా పవన్‌ కల్యాణ్ తన ట్విటర్ అకౌంట్‌లో కామన్ డీపీ మార్చారు. జనసేన జెండా బ్యాక్‌ డ్రాప్‌లో నిల్చొని కోపం, ఆవేశంతో ఉన్న ఫొటోని ట్విటర్ డీపీగా పెట్టుకున్నారు. ఇందులో పవన్‌ లుక్‌ ఫ్యాన్స్‌ని కట్టిపడేసేలా ఉంది. దీంతో అభిమానులు ఆయన డీపీని నెట్టింట వైరల్ చేశారు. ఆ ఫొటోని షేర్ చేస్తూ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. #Pawankalyan #Shocked అనే హ్యాష్ ట్యాగ్స్‌ను ట్విటర్‌లో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విటర్‌లో ఇదే హాట్ టాపిక్ అయింది. పవన్‌ వీరాభిమానులు ఆయన ఫొటోను సోషల్ మీడియా షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు, కామన్ పీపుల్ పవన్ ఫాలోయింగ్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు. పవన్ డీపీ మారిస్తే ఇంత రచ్చనా అని నోరెళ్లబెడుతున్నారు.

ప్రస్తుతం పవన్ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో యాక్టివ్‌గా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకుసాగుతున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహరవీరమల్లు' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది కాకుండా హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ అనే మరో చిత్రాన్ని కూడా చేస్తున్నారు.


Next Story