ప్రకాశం జిల్లాలో సజీవ సమాధికి యత్నం.. ఆలయం వద్ద గొయ్యి తీసి..

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. దీంతో అతడిని పోలీసులు అడ్డుకున్నారు.

By అంజి
Published on : 31 March 2025 11:18 AM IST

Police, bury himself alive, Prakasam district, APnews

ప్రకాశం జిల్లాలో సజీవ సమాధికి యత్నం.. ఆలయం వద్ద గొయ్యి తీసి..

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఓ వ్యక్తి సజీవ సమాధికి యత్నించాడు. దీంతో అతడిని పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విఠలాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచి కైపు అంజిరెడ్డి కొడుకు కోటిరెడ్డి 12 ఏళ్ల క్రితం తన పొలంలో భూదేవి గుడిని సొంతంగా నిర్మించాడు. ఈ క్రమంలోనే గత వారం రోజుల క్రితం ఆలయం ముందు పెద్ద గొయ్యి తీశాడు. ఆ రోజు నుండి అందులోకి వెళ్లి పైన రేకు కప్పుకుని ధ్యానం చేస్తున్నాడు.

ఉగాది పండగ నాడు సజీవ సమాధి కావాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో నిన్న ఉదయం 5 గంటల ప్రాంతంలో తన కొడుకుతో కలిసి కోటిరెడ్డి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశాడు. ఆ తర్వాత సమాధిలా ఏర్పాటు చేసిన గొయ్యిలోకి దిగి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కోటిరెడ్డి కొడుకు ఆ గొయ్యిపై పెద్ద రేకును ఉంచి దానిపై మట్టి పోసి పూడ్చి వేశాడు. కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి, మరికొందరు ఈ విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లారు. కొటిరెడ్డిని బయటకు రావాలని కోరారు. తన ధ్యానానికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని కోటిరెడ్డి సూచించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతనిని బయటకు తీశారు.

Next Story