జేసీ కుటుంబంపై కేసు నమోదు

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్‌ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

By M.S.R  Published on  14 May 2024 10:46 AM GMT
జేసీ కుటుంబంపై కేసు నమోదు

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్‌ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం సృష్టించారని కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదు వాహనాలు ధ్వంసం కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. అయితే వైసీపీ నేతలే తమ మీద దాడులకు తెగబడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు.

ఇక సోమవారం నాడు ఒకే పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిలు ఓటు వేయడానికి వచ్చారు. వారిద్దరు ఎదురు పడటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో పోలీసులు ఇరువురు నేతలకు నచ్చజెప్పారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు.

Next Story