అక్కడ అనుమతి లేకుండా పర్యటించారని..మాజీ సీఎం జగన్‌పై కేసు
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
By Knakam Karthik
అక్కడ అనుమతి లేకుండా పర్యటించారని..మాజీ సీఎం జగన్‌పై కేసు
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ గుంటూరులని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎన్నికల సంఘం అధికారుల కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు పార్టీ నేతలు, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబులపై కేసు నమోదు చేశారు.
గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండంటతో.. జగన్ ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్ తీసుకోకుండానే బుధవారం గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారని అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌తో పాటు, పోలీస్ యాక్ట్ ప్రకారం విధించిన నిబంధనలను ఉల్లఘించారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది.
ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా అనుచరులతో వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్‌తోపాటు మరో ఏడుగురు నేతలపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించి కేసులో చేర్చే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి.