కంభంపాటి శిరీషను తాళ్లతో లాక్కెళ్లిన పోలీసులు

Police drag TDP leader Kambhampati Sirisha with rope. టీడీపీ నేతలు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎస్సీ మహిళా నేత శిరీషను మగ పోలీసులు

By అంజి  Published on  20 Sept 2022 1:15 PM IST
కంభంపాటి శిరీషను తాళ్లతో లాక్కెళ్లిన పోలీసులు

టీడీపీ నేతలు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎస్సీ మహిళా నేత శిరీషను మగ పోలీసులు తాళ్లతో కట్టి లాగారని మహిళా నేతలు ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా, అరాచకంగా వ్యవహరిస్తోందంటూ ఆమె నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మహిళ అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారని మండిపడుతున్నారు. రోప్ వే కోసం ఉపయోగించే తాళ్లతో కట్టేయాలని చూశారని చెప్పారు. శాంతియుతంగా తమ కార్యక్రమాన్ని తాము చేసుకుంటుంటే తమ పట్ల దారుణంగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story