Andrapradesh: కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల విడుదల రేపటికి వాయిదా

ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా పడింది.

By Knakam Karthik
Published on : 29 July 2025 11:11 AM IST

Andrapradesh, AP Police Constable Results, Constable Exam Results

Andrapradesh: కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల విడుదల రేపటికి వాయిదా

ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల విడుదల వాయిదా పడింది. నేడు ఉదయం 11 గంటలకు ఫలితాలు రిలీజ్ కావాల్సి ఉండగా..చివరి నిమిషంలో రిజల్ట్స్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. తుది జాబితాను మరోసారి పరిశీలించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయించిందని.. ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే ఫలితాలు వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో ఫలితాలను పరిశీలించి రేపు విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కాగా రాష్ట్రంలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్షకు అప్లయ్ చేసుకున్నారు. వీరిలో 5,03,487 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా, 4,58,219 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.

Next Story