Video: చిత్తూరులో బీటెక్ విద్యార్థి సూసైడ్.. పోలీసులు వ్యహారించిన తీరుపై తీవ్ర ఆగ్రహం
కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది.
By - అంజి |
Video: చిత్తూరులో బీటెక్ విద్యార్థి సూసైడ్.. పోలీసులు వ్యహారించిన తీరుపై తీవ్ర ఆగ్రహం
కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొంగారెడ్డిపల్లికి చెందిన శశి కుమార్, తులసిల కొడుకు రుద్రమూర్తి (19) మురకంబట్టులోని ఓ సితామ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చదుతున్నాడు. మంగళవారం నాడు కాలేజీ బిల్డింగ్ పైకెక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారం కారణంగానే రుద్రమూర్తి సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు, కాలేజీ యాజమాన్యం చెబుతోంది.
కాగా రుద్రమూర్తి ఆత్మత్య చేసుకున్నాడన్న విషయం తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు కాలేజీ వద్దకు చేరుకుని విలపించారు. ఈ క్రమంలోనే విద్యార్థి మృతి చెందిన తర్వాత జరిగిన ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కళాశాలలో రుద్ర ఆత్మహత్య తర్వాత అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలిస్తున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలను ఎదుర్కొంది. అతని తల్లి తులసి.. హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ యువరాజులు వేధింపులే తన కొడుకు మరణానికి కారణమని ఆరోపించారు.
మృతదేహాన్ని తరలించడానికి తల్లి నిరాకరించింది. ఈ క్రమంలోనే సీఐ నిత్యబాబు ఆదేశాల మేరకు మహిళా కానిస్టేబుళ్లు ఆమెను బలవంతంగా నెట్టేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్ర ప్రేమ విఫలం కావడం వల్లే ఈ చర్య తీసుకున్నాడని డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. అయితే బాధితుడి తల్లి తులసి.. హెచ్ఓడీ తన కొడుకును నిరంతరం వేధించాడని, అరెస్టు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.