తిరుప‌తి యువ‌కుడిపై ప్ర‌ధాని ప్ర‌శంస‌ల జ‌ల్లు

PM Modi praises Sai Praneeth on Mann Ki Baat.తిరుప‌తికి చెందిన సాయి ప్ర‌ణీత్ అనే యువ‌కుడిని ప్ర‌ధాని న‌రేంద్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2021 1:15 PM IST
తిరుప‌తి యువ‌కుడిపై ప్ర‌ధాని ప్ర‌శంస‌ల జ‌ల్లు

తిరుప‌తికి చెందిన సాయి ప్ర‌ణీత్ అనే యువ‌కుడిని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌శంసించారు. నేడు మ‌న్‌కీబాత్‌లో మోదీ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. ఏపీ వెద‌ర్ మ్యాన్ పేరుతో సామాజిక మాధ్య‌మాల్లో వాతావ‌ర‌ణ స‌మాచారాన్ని అందిస్తున్న సాయి ప్ర‌ణీత్‌ను మోదీ అభినందించారు. రైతుల‌కు ఆ యువ‌కుడు అందిస్తున్న సేవ‌ల‌ను మోదీ మెచ్చుకున్నారు. కాగా.. సాయి ప్ర‌ణీత్ బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ప‌నిచేస్తున్నాడు. గ‌త ఏడు సంవ‌త్స‌రాలుగా వాతావ‌ర‌ణ అంశాల‌ను విశ్లేషిస్తున్నాడు. కాగా.. ఇప్ప‌టికే ఐఎండీ, ఐరాస నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు అందిస్తున్న సేవ‌ల గురించి తెలుసుకున్న ప్ర‌ధాని మోదీ.. మ‌న్‌కీబాత్ కార్య‌క్ర‌మంలో ప్ర‌స్తావించారు.

చండీగ‌ఢ్‌కు చెంద‌ని 29 ఏళ్ల సంజ‌య్ రాణాను కూడా మోదీ ప్ర‌శంసించారు. ఆ యువ‌కుడు ఫుడ్ స్టాల్ ను నిర్వ‌హిస్తుంటాడ‌ని, సైకిల్ పై తిరుగుతూ ఛోలే భ‌తూర్ అనే వంట‌కాన్ని అమ్ముతుంటాడ‌ని మోదీ అన్నారు. క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆయ‌న ఉచితంగా దాన్ని అందిస్తూ స్ఫూర్తిగా నిలిచార‌ని కొనియాడారు.

క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా తొల‌గిపోలేద‌న్నారు. కావున పండుగ‌లు, శుభ‌కార్యాలు జ‌రుపుకునేట‌ప్పుడు ఖ‌చ్చితంగా కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌న్నారు. క‌రోనా ఇంకా మ‌న మ‌ధ్యే ఉంద‌న్నారు. మాస్క్ ధ‌రించ‌డం మ‌రిచిపోవ‌ద్ద‌న్నారు.

Next Story